Harish Rao: నెలల తరబడి కార్మికులకు జీతాలు రాలేదు
Harish Rao: 60 వేల మంది కార్మికులకు జీతాలు అందలేదు
Harish Rao: నెలల తరబడి కార్మికులకు జీతాలు రాలేదు
Harish Rao: పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రావడం లేదని ట్విటర్ వేదికగా హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలోని 12 వేల 769 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న 60 వేలకుపైగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు అందడం లేదన్నారు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేద వర్గాలకు చెందిన వారి కష్టాలను అర్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
Next Story




