Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచింది

Jyothi
Published on: 1 April 2024 2:04 PM IST
Former Minister Harish Rao Letter to CM Revanth Reddy
X

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: టెట్‌ ఫీజులను తగ్గించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్‌రావు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచిందన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని ప్రభుత్వం విస్మరించిందన్నారు. టెట్‌ ఫీజులను పెంచడం నిరుద్యోగులను మోసం చేయడమేనని లేఖలో తెలిపారు. అభ్యర్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు హరీష్‌రావు. టెట్ ఫీజులు తగ్గించాలని విద్యా్ర్థులు రోడ్డెక్కినా పట్టించుకోవడంలేదని అన్నారు. పెంచిన టెట్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story