Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: కేసీఆర్‌ను డెకాయిట్ అంటూ సంబోధించిన మంత్రి ఉత్తమ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Aug 2024 8:37 PM IST
Harish Rao
X

Harish Rao

Harish Rao: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను డెకాయిట్‌ అని మంత్రి ఉత్తమ్ సంబోధించడం.. ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శమని హరీష్ రావు అన్నారు. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం సీఎం రేవంత్‌కు మించిపోయారని హరీష్ రావు మండిపడ్డారు.

పేరేమో ఉత్తమ్ కుమార్ కానీ.. మాట తీరు మూసీ ప్రవాహం అంటూ విమర్శించారు. రేవంత్ నోటితో పాటు.. ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే.. 40 వేల కోట్లకు పెంచుకున్న సంగతి మార్చిపోయారా ఉత్తమ్ అంటూ ఓ లేఖ విడుదల చేశారు. ఇది మీ డెకాయిటీ కాదా అంటూ లేఖలో విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story