Etela Rajender: 4న ఈటల రాజీనామా? ఈటల సహా మొత్తం అయిదుగురు..

Etela Rajender: మాజీమంత్రి ఈటల చేరికకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 3 Jun 2021 10:06 AM IST
Former Minister Etela Rajender to Join BJP
X

ఈటల రాజేందర్(ఫైల్ ఇమేజ్ )

Etela Rajender: మాజీమంత్రి ఈటల చేరికకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మంత్రివర్గం నుంచి బర్తరప్ అయిన ఈటల రాజేందర్ రేపు (శుక్రవారం) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 8 లేదంటే 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల.. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు.

ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని దిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని రాజేందర్‌ అన్నట్లు సమాచారం. ఈటల రాజేందర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు ఈటల ఈ నెల 4న విలేకరుల సమావేశం పెడుతున్నారు. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story