కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత పెద్దిరెడ్డి

E Peddi Reddy: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

Arun Chilukuri
Published on: 30 July 2021 6:53 PM IST
Former Minister E Peddi Reddy joins in TRS
X

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత పెద్దిరెడ్డి

E Peddi Reddy: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. పెద్దిరెడ్డికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, కొప్పుల, గంగుల, ఎల్.రమణ, బాల్కా సుమన్ హాజరైర్యారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహితుడని కేసీఆర్ చెప్పారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉందని, తెలంగాణ అభివృద్ధిలో పెద్దిరెడ్డి ఇక నుంచి భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.

చేనేత కార్మికులకు రైతుబీమా తరహా సహాయం అందిస్తామని, వ్యవసాయ శాఖలో పక్కాగా రైతుబంధు అమలవుతోందని కేసీఆర్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఉండేవి అని సీఎం కేసీఆర్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story