Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కేఏ పాల్

Babu Mohan: తగిన గౌరవం లేకపోవడం వల్లే పార్టీ వీడానన్న బాబు మోహన్

Shekhar G
Published on: 4 March 2024 3:59 PM IST
Former Minister Babu Mohan Joined Praja Shanthi Party
X

Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కేఏ పాల్

Babu Mohan: మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్.. ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారని.. ఆ పార్టీ అధ్యక్షుడు KA పాల్ ప్రకటించారు. గతంలో తాను పనిచేసిన పార్టీలో తగిన గౌరవం లేకపోవడం వల్లే ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ తెలిపారు. బీజేపీ కోసం ఎంత కృషి చేసినా తనకు సరైన పదవి, గౌరవం అభించలేదని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని తప్పక విజయం సాధిస్తానని పేర్కొన్నారు బాబు మోహన్.

Shekhar G

Shekhar G

Next Story