Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

Kothakota Dayakar Reddy: ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Jyothi
Published on: 13 Jun 2023 7:48 AM IST
Former Kothakota Dayakar Reddy Passed Away
X

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

Kothakota Dayakar Reddy: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న దయాకర్ రెడ్డి.. ఉదయం తుదిశ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని తన స్వగ్రామమైన పర్కాపురం వచ్చారు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కన్నుమూశారు. దయాకర్‌రెడ్డి మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దంపతులిద్దరికి టీడీపీతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా పార్టీలోనే కొనసాగారు.

Jyothi

Jyothi

Next Story