KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

KCR: రైల్‌రోకో కేసు విచారణపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2024 4:45 PM IST
Former CM KCR is in high court
X

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైల్ రోకో కేసు విచారణపై స్టే విధించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నారని కేసీఆర్‌పై కేసు నమోదు కాగా... దానిపై.. 2011లో కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని.. తప్పుడు కేసును నమోదు చేశారని కోర్టును కోరారు. తాను రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనలేదుని.. తెలిపారు. కేసీఆర్ పిటీషన్‌ పరిశీలించిన హైకోర్ట్.. రైల్ రోకో కేసు విచారణపై స్టే విధించింది. దీనికి సంబంధించి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story