Mallik Teja: ఫోక్ సింగర్ మల్లిక్ తేజా‌కు హైకోర్టు‌లో ఊరట

Mallik Teja: మల్లిక్ తేజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Oct 2024 8:45 PM IST
Folk singer Mallikteja gets a reprieve in the High Court
X

Mallik Teja: ఫోక్ సింగర్ మల్లిక్ తేజా‌కు హైకోర్టు‌లో ఊరట

Mallik Teja: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు హైకోర్టు‌లో ఊరట లభించింది. మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్‌పై మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కంప్లయింట్ చేసింది. దీనిపై మల్లిక్ తేజ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. నిరాధార ఆరోపణలు చేశారంటూ మల్లిక్ తేజ్ తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు... మల్లిక్ తేజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story