వరద తగ్గింది.. అనారోగ్యం పొంచివుంది

వరద తగ్గింది.. అనారోగ్యం పొంచివుంది
x
Highlights

వరదల బీభత్సం తరువాత ఇప్పుడిప్పుడే ప్రజలు తెరుకుంటున్నారు. భాగ్యనగరంలో చాలా ప్రాంతాలు ఇంకా జలమయమయ్యే ఉన్నాయి. మరోవైపు వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు...

వరదల బీభత్సం తరువాత ఇప్పుడిప్పుడే ప్రజలు తెరుకుంటున్నారు. భాగ్యనగరంలో చాలా ప్రాంతాలు ఇంకా జలమయమయ్యే ఉన్నాయి. మరోవైపు వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబల్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

హైదబాబాద్ లో నాలగు రోజుల వరదల భీభత్సం తర్వాత నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం వర్షం ఆగిపోయినప్పటికి దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వరద ప్రాంతాల్లో నీరు కలుషితమైనందున అంటు వ్యాదుల ముప్పు భయపెడుతోంది. జీవనోపాధి కోసం భాగ్యనగరాన్ని ఆశ్రయించిన అభాగ్యులకు వరదలు నిండా ముంచాయి. ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులు మొ దలు కట్టుకునే బట్టల వరకు అన్ని నీటిలోనే కొట్టుకుపోయాయి.

ఇక జీహెచ్ఎంసీ పరిధిలో అంటు వ్యాదుల ముప్పు రాకుండా ఉండడానికి 60 వైద్య క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మురుగు నీటిలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడానికి అప్రమత్తం చేసారు. ఇప్పటికే చాల ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తమ తమ విధుల్లో నిమగ్నమయ్యారు. వరద ప్రాంతాల్లో అంటు వ్యాదులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, దోమలు అధికంగా వ్యాప్తించకుండా నివారించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వరదలు తగ్గినప్పటికి వ్యాధులు వ్యాప్తించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి కాలనీలో, బస్తీల్లో హెల్త్ క్యాంప్ లు ఎర్పాటు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories