logo
తెలంగాణ

సాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

Flex War Between BJP And TRS in Hyderabad | Hyderabad News
X

టీఆర్ఎస్‌- బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్

Highlights

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ పరిసరాల్లో వెలిసిన ఫ్లెక్సీ

TRS Vs BJP: తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్‌ తారస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్‌ ఫైట్‌కు టీఆర్ఎస్‌ తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇస్తోంది. హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభ జరగనున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ సంపకు మోడీ అంటూ ఫ్లెక్సీలో రాశారు. బై బై మోడీ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ ఆఫీసులో సాలు సారూ అంటూ కేసీఆర్ ఫొటోతో కౌంట్ డౌన్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పోటీగా మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి.

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ‌లు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు. బిజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఫ్లెక్సీలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బేగంపేట పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. క్రేన్ తెప్పించి ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. అటు మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.


Web TitleFlex War Between BJP And TRS in Hyderabad | Hyderabad News
Next Story