పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు.. డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయం

Hyderabad: ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం

Shireesha
Updated on: 20 Dec 2021 11:41 AM IST
First 2 Men Got Married in Hyderabad Telangana | Telangana Breaking News
X

పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు.. డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయం

Hyderabad: హైదరాబాద్‌లో విచిత్రమైన పెళ్లి జరిగింది. అదేంటి పెళ్లి అందరూ చూసుంటారు. కదా ఇందులో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా..?. ఈ పెళ్లి జరిగింది అమ్మాయి, అబ్బాయికి కాదు... ఇద్దరు అబ్బాయిలకు. ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న పురుష జంటగా వీరు రికార్డులకెక్కారు.

సుప్రియో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ పెద్దలకు నచ్చజెప్పి వివాహానికి సిద్ధమయ్యారు. ఏదో సాదాసీదాగా చేసేసుకున్నారనుకుంటున్నారా...? వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో నిర్వహించారు ఈ వివాహ వేడుక.

పెళ్లి సందర్భంగా సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అతిథుల హర్షాతిరేకాల మధ్య ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు, బంధు మిత్రులు హాజరై జంటను ఆశీర్వదించారు.


Shireesha

Shireesha

Next Story