Diesel Tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పేలడంతో పెద్ద ఎత్తున మంటలు

Diesel Tanker: పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు

Jyothi
Published on: 9 Jan 2024 10:14 AM IST
Fire After Diesel Tanker Overturned In Jagtial Metpally
X

Diesel Tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పేలడంతో పెద్ద ఎత్తున మంటలు

Diesel Tanker: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వెంకట్రావుపేట పెట్రోల్‌ బంక్ సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. మెట్‌పల్లి అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను నిలిపివేశారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Jyothi

Jyothi

Next Story