కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

Arun Chilukuri
Published on: 5 Jan 2021 6:16 PM IST
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం
X

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. రామాలయం రోడ్డులోని ఓ టీవీ రిపేరింగ్‌ సెంటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్‌ సర్కూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story