Gandhi Hospital: సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

* మంటల్లో కాలిబూడిదైన ఎలక్ట్రిక్‌ బాక్సులు * మూడు బిల్డింగ్స్‌లో నిలిచిపోయిన కరెంట్‌ సరాఫరా

Sandeep Reddy
Updated on: 20 Oct 2021 9:30 AM IST
Fire Accident in Secunderabad Gandhi Hospital
X

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం (ఫోటో: ది హన్స్ ఇండియా)

Gandhi Hospital: సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఎలక్ట్రిక్‌ బాక్సులు కాలిబూడిదయ్యాయి. దీంతో ఆసుపత్రికి చెందిన మూడు బిల్డింగ్స్‌లో కరెంట్‌ సరాఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రిలోని మొదటి రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు, చిన్నపిల్లల వార్డును మరో బిల్డింగ్‌కు షిఫ్ట్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తోంది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్యూట్‌ కారణమని సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story