Nalgonda: పేలిన రియాక్టర్‌.. పలువురు కార్మికులు మృతి..!

Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 24 Aug 2022 6:21 PM IST
Fire Accident in Pharma Company in Nalgonda
X

Nalgonda: పేలిన రియాక్టర్‌.. పలువురు కార్మికులు మృతి..!

Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెలిమినేడులోని ఓ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో పలువురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తోంది. మంట‌లు ఎగిసి ప‌డుతుండ‌టంతో.. స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story