మంచిర్యాల జిల్లాలో ఘోరం.. ఒకే ఇంట్లో ఆరుగురి సజీవ దహనం

Fire Accident In Mancherial District 6 Dead
x

Crime News: మంచిర్యాల జిల్లాలో ఘోరం.. ఒకే ఇంట్లో ఆరుగురి సజీవ దహనం

Highlights

*అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేలోపే సజీవదహనం

Crime News: మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఆరుగురు సజీవదహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని మాసు శివయ్య ఇంట్లో ఈ ఘోరం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వారిలో మాసు శివయ్య, ఆయన భార్య పద్మ, ఆమె అక్క కూతురు మౌనికతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు స్వీటీ, హిమబిందు ఉన్నారు. కోటపల్లి మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన మౌనిక రెండు రోజుల క్రితమే పద్మ ఇంటికి వచ్చింది. చుట్టపు చూపుగా వచ్చిన ఆమెతో పాటు.. ఇద్దరు చిన్నారులు కూడా కాలి బూడిదయ్యారు. కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక భర్త చనిపోయాడు. తనకు తల్లిదండ్రులు కూడా లేరు. ఈ నేపథ్యంలో తన పిన్ని అయిన పద్మ ఇంటికి తరచూ వస్తుండేది. రెండు రోజుల కింద టే పద్మ ఇంటికి వచ్చింది. చుట్టపు చూపుగా వచ్చిన పద్మతో పాటు ఆమె పిల్లలు ఇద్దరూ ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఆరుగురు సజీవ దహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారాం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పేశారు. అయితే అప్పటికే లోప‌ల ఉన్న వారు చ‌నిపోయార‌ని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతదేహాల‌ను చూడ‌గానే గుండెలు తరుక్కుపోయాయన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో రెండు పెట్రోల్ క్యాన్లు గుర్తించారు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి కొంత దూరంలో రెండు పెట్రోల్ క్యాన్లను పోలీసులు గుర్తించారు. శివయ్య కుటుంబ సభ్యులతో పాటు మరో వ్యక్తి సింగరేణి కార్మికుడు శాంతయ్య ఘటనలో మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులు సజీవ దహనానికి పాల్పడి ఉంటారానే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు.

శివ‌య్య భార్య ప‌ద్మకు శాంత‌య్యకు మ‌ధ్య శారీర‌క సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతయ్య కుటుంబ సభ్యులు చూడడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ఇదే వ్యవహారంపై శాంత‌య్య కుటుంబ స‌భ్యులు నిత్యం అతన్ని నిల‌దీసేవారు. శాంత‌య్య భార్య అతను ప‌నిచేస్తున్న గ‌ని దగ్గరకు వెళ్లి అక్కడ కూడా గొడ‌వ చేసేది. శాంత‌య్యపై కొద్ది రోజుల క్రితం హ‌త్యాయ‌త్నం చేయ‌గా, దాని నుంచి కూడా త‌ప్పించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిసింది.

ఉద్యోగం, పొలాల కోసం జ‌రిగిన గొడ‌వ‌లే ఈ ఘటనకు కార‌ణ‌మా..? అని కూడా అనుమానిస్తున్నారు. సింగ‌రేణిలో మైనింగ్ స‌ర్దార్‌గా ప‌నిచేస్తున్న శాంత‌య్య మ‌రో రెండేళ్లలో రిటైర్ కానున్నారు. ఆ ఉద్యోగం వేరే వాళ్లకు ఇస్తార‌ని కొడుకు భావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వారు శాంత‌య్యను నిల‌దీసిన‌ట్లు సమాచారం. ల‌క్ష్సెట్టిపేట మండ‌లం ఊత్కూరులో పొలాలు ఉన్నాయి. అవి కూడా చేజారిపోకుండా ఉండేందుకు త‌మ పేరిట రాయాల‌ని గొడ‌వ చేస్తున్నట్లు స‌మాచారం.

రంగంలోకి దిగిన డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏసీపీ, సీఐ ప్రమోద్‌రావు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మొద‌ట వాటిని త‌ర‌లించే ప్రయ‌త్నం చేశారు. అయితే మృతదేహాలు గుర్తించలేని విధంగా మారిపోవ‌డంతో సంఘటన స్థలం వ‌ద్దే పోస్టుమార్టం నిర్వహించారు. సింగరేణి కార్మికుడు శాంతయ్య కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో అతని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు న‌లుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories