కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో..

Arun Chilukuri
Published on: 29 Aug 2020 12:22 PM IST
కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో..
X

Fire Accident: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిసిటీ క్యాంపస్ లోని స్పోర్ట్స్ సెంటర్ సమీపంలో మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది.

అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో పలు ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోయాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story