Rangareddy: అగ్ని ప్రమాదం.. మినరల్ రా మెటీరియల్ కంపెనీలో మంటలు

Rangareddy: రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా

Jyothi
Updated on: 3 April 2024 9:31 AM IST
Fire Accident at Mineral Raw Material Company
X

Rangareddy: అగ్ని ప్రమాదం.. మినరల్ రా మెటీరియల్ కంపెనీలో మంటలు

Rangareddy: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విమల్ మినరల్ రా మెటీరియల్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిశ్రామిక వాడలో వరుస అగ్ని ప్రమాదాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story