కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

admin1
Updated on: 9 Feb 2020 8:35 PM IST
కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
X

జనగామ జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహకార ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అధికారపార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. నర్మెట్ట ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధి నక్కల గట్టయ్యకు నలుగురు బిడ్డలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు అధారాలతో సహా నిరూపించారు. అధికారులు స్క్రూట్నీలో అభ్యర్ధి నామినేషన్ తొలగించకుండా కొనసాగించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు.


admin1

admin1

Next Story