Fee Moon Trip: చంద్రుడి మీదకు ఫ్రీ ట్రిప్..భారతీయుల ఆశక్తి
Fee Moon Trip: జపనీస్ బిలియనీర్ తనతోపాటు చంద్రుడి మీదకు వెళ్లేందుకు 8 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తానని తెలిపారు.
ఇమేజ్ సోర్స్ : ఎబిఎన్.కామ్
com
Fee Moon Trip: ఆకాశంలో జరిగే మార్పులు చూసేందుకు చాలా మంది చంద్రుడి పైకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ వుంటారు. ఎప్పుడు ఆ అవకాశం వస్తుందా అని కళ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తుంటారు. ఇపుడు ఆ అవకాశం రానే వచ్చింది. అయితే ఈ కలను నేను నిజం చేస్తానంటూ ముందుకొచ్చాడో జపనీస్ బిలియనీర్. యుసాకు మాయిజావా అనే ఈ కుబేరుడు.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లాలని డిసైడయ్యాడు. ఈ ట్రిప్పులో తనతోపాటు చంద్రుడి మీదకు రావడానికి 8 మంది సభ్యుల కోసం చూస్తున్నానని ప్రకటించాడు. దీని కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పాడు. ఇలా ప్రకటించిన నాలుగు రోజుల్లోనే ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయట అతనికి. మొత్తం 15 దేశాల నుంచి ఈ దరఖాస్తులు రాగా, వాటిలో అత్యధికం భారత్ నుంచే వచ్చాయని యుసాకు పేర్కొన్నాడు. ఎలాన్ మస్క్ తయారు చేసిన స్పేస్ ఎక్స్ రాకెట్ లో తనతో పాటు మొత్తం 8 మందిని ఉచితంగా తీసుకుని వెళతానని తెలిపారు.




