
మండలం జానకీపురం గ్రామం లో వానర సైన్యం చేస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు ప్రతిరోజు వేల సంఖ్యలో కోతులు పంటలపై పడి పంటలు నాశనం చేస్తున్నాయి
ధర్మసాగర్: మండలం జానకీపురం గ్రామం లో వానర సైన్యం చేస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు ప్రతిరోజు వేల సంఖ్యలో కోతులు పంటలపై పడి పంటలు నాశనం చేస్తూ వాటిని అడ్డుకోవడానికి వెళ్లే రైతులను గాయపరుస్తూ, రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. కోతులు పంటనష్టం చేస్తున్న వెల్లగొట్టే సహాసం చేయకేకపోతున్నారు. రైతులు కోతులను అక్కడి నుండి తరిమివేయాలంటే శక్తికి మించిన పని అవుతుంది. అలాగే గ్రామాల్లోకి వచ్చి తలుపులు తీసి ఉన్న ఇండ్లలోకి పోయి వండుకున్న గిన్నెలు బయటకి ఎత్తుకెళుతూ ఇండ్లలో ఉండే మహిళలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కోతులను పట్టుకొనే వారిని తీసుకువచ్చి అడవిలోకి కోతులను వదులుదాము అంటే ఆర్థికంగా రైతులు భరించలేని పరిస్థితి.కొందరు రైతులైతే కొన్ని రకాల పంటలు వేయడమే మానేశారు ఆ వానర సైన్యానికి భయపడి. ఇది మా ఒక్క గ్రామం పరిస్థితే కాదు చుట్టూ ప్రక్కల ఉన్న అనేక గ్రామాల రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించగలరని అక్కడి చుట్టూ ప్రక్కల గ్రామాల రైతులు కోరుతున్నారు. కొందరు వ్యక్తులు సహాయం చేస్తుంటారు. లెక్కకు మిక్కిలి దానం చేస్తూ చందాలు రాస్తుంటారు కానీ ఇలాంటి రైతులకు కోతులను పట్టడానికి సహాయం చేయండి దేవునికి చేసే సేవ కంటే, మానవునికి చేసే సహాయం గొప్పది. అందులో దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే ఇంకా గొప్పది అని అక్కడి రైతులు అంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




