Wanaparthy - Family Kidnap: వనపర్తి జిల్లాలో ఓ కుటుంబం కిడ్నాప్‌

* సంపత్‌రావుపల్లికి చెందిన ఓ కుటుంబం కిడ్నాప్‌ * హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసి వనపర్తికి తరలింపు

Sandeep Reddy
Published on: 20 Aug 2021 12:57 PM IST
Family Kidnaped With Finacial Issues in Hyderabad And Moved to Wanaparthy
X

వనపర్తి జిల్లాలో కుటుంబం కిడ్నాప్‌

Wanaparthy - Family Kidnap: వనపర్తి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా సంపత్‌రావుపల్లికి చెందిన ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి, వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు ప్రత్యర్థులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి బాధిత కుటుంబాన్ని కాపాడారు. శ్రీకాంత్‌ అనే వ్యక్తికి ఒళ్లంతా గాయాలు చేశారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.

జీహెచ్‌ఎంసీలో నీటి సప్లయ్‌ చేసేందుకు మేకల చంద్రయ్య అనే వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా శ్రీకాంత్‌ను నియమించుకున్నాడు. అయితే వీరి మధ్య ఆర్థిక లావాదేవీలపై గొడవ ప్రారంభమైంది. డబ్బుల వసూళ్ల కోసం శ్రీకాంత్‌తో పాటు అతడి కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి, ఇంట్లో నిర్బంధించాడు. అనంతరం చిత్రహింసలకు గురిచేశాడు. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చంద్రయ్య కోసం గాలిస్తున్నారు.

ఈ నెల 11న హైదరాబాద్‌ వనస్థలిపురంలో శ్రీకాంత్‌ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసిన దుండగులు కారులో వనపర్తికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఓ ఇంట్లో బంధించి క్యాండిల్స్‌తో కాల్చి, చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం హస్తీనాపురంలోని ఓ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story