పెళ్లి విందు పెట్టనందుకు కుల బహిష్కరణ..లక్ష జరిమానా

పెళ్లి విందు పెట్టనందుకు కుల బహిష్కరణ..లక్ష జరిమానా
x
బహిష్కరణకు గురైన కుటుంబం
Highlights

Family Eviction : గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని ఆచారాలను, ఆనవాయితీలను పాటిస్తూనే ఉన్నారు. ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే గ్రామంలోని కులస్తులను పిలిచి...

Family Eviction : గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని ఆచారాలను, ఆనవాయితీలను పాటిస్తూనే ఉన్నారు. ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే గ్రామంలోని కులస్తులను పిలిచి వారికి ముందుగా ఆతిధ్యం అందించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక వేల ఎవరైనా దాన్ని విస్మరిస్తే చాలు ఇంక వారిని ఆ కులం నుంచే బహిష్కరిస్తారు. లేదా ఎంతో కొంత డబ్బును జరిమానాగా విధిస్తారు. ఇటీవలే ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. కులపెద్దలు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లిస్తేనే ఆ కుటుంబసభ్యులు కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించారు. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులను అదే విధంగా మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఏప్రిల్ 27వ తేదీన ఏపీ లింగోటం గ్రామానికి చెందిన ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే జరిపించారు. అయితే వారు యాదవ కులానికి చెందిన వారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో వారు ఎక్కువ మందిని పిలవకుండా పరిమిత సంఖ్యలో బంధువుల పిలిచి పెళ్లి తంతును ముగించారు. ఈ విషయం కాస్త కుల పెద్దలు, గ్రామస్థులకు తెలిసింది. అయితే వారిని పిలవకుండా భోజనం పెట్టకుండా ఈ తంతును ముగించినందుకు వారు ఆగ్రహించారు. ఆ కోపంతో కుల పెద్దలు, గ్రామ పెద్దలు వారి కులదైవం గంగదేవమ్మ పండుగకు లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. దీంతో బాధిత కుటుంబీకులు ఇదేంటని ప్రశ్నించగా కుమారుడి పెళ్లి చేసారు కానీ కులపెద్దలకు విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ, జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితులు గ్రామంలో తమను కులపెద్దలు అవమానించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు.




Show Full Article
Print Article
Next Story
More Stories