Fake Inspector: బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్‌పెక్టర్ అరెస్ట్

Fake Inspector: ఖమ్మం సిఐ పేరుతో వైద్యుడికి బెదరింపులు * రూ.75 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 11:38 AM IST
Fake Inspector Arrested in Banjara Hills, Fake Inspector
X

బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Fake Inspector: బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్ పెక్టర్ గుట్టురట్టయింది. ఖమ్మం సిఐ ని అంటూ ఒక వైద్యుడికి ఫోన్ చేసి 75 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు బాధిత వైద్యుడు ఫిర్యాదు చేయడంతో.. పక్కా ప్లాన్ తో మాటు వేసి నకిలీ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. గతంలో వైద్యుడి ఇంట్లో మహేష్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే వైద్యుడికి సంబంధించిన కాల్ రికార్డుంగ్ లను మహేష్ తెలివిగా తీసుకున్నాడు. ఇది గమనించిన వైద్యుడు మహేష్ ను విధుల్లో నుంచి తొలగించాడు. దీంతో నకిలీ ఇన్స్ పెక్టర్ అవతారమెత్తి డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆడియో రికార్డింగ్ లను బయటపెడతా అంటూ బెదిరింపులకు దిగాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story