logo
తెలంగాణ

Hyderabad: ఇద్దరు యువతులపై బాబా అత్యాచారం

Fake Baba Arrested in Hyderabad Old City
X

Hyderabad: ఇద్దరు యువతులపై బాబా అత్యాచారం

Highlights

Hyderabad: మూఢ నమ్మకాలతో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Hyderabad: మూఢ నమ్మకాలతో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పాతబస్తీలో మంత్రాలతో వైద్యం పేరుతో ఓ దొంగ బాబా ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ యువతికి విడాకులిప్పించి, పలుమార్లు బాబాతో పాటు అతడి కుమారుడు అత్యాచారం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగానూ కుంగదీశారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ బాబాతో పాటు అతడి కుమారుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అనారోగ్యానికి గురైన వారు సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి వైద్యులకు చూపించుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రజలు భూత వైద్యులను నమ్మవద్దని సూచించారు. మంత్రాల పేరుతో మోసం చేసే వారి వివరాలను స్థానిక పోలీసులకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Web TitleFake Baba Arrested in Hyderabad Old City
Next Story