Akhilesh Yadav: ఇవాళ కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్ భేటీపై ఉత్కంఠ

Akhilesh Yadav: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ లంచ్ భేటీ

Shekhar G
Published on: 3 July 2023 8:47 AM IST
Excitement Over Akhilesh Yadav Meeting With KCR Today
X

Akhilesh Yadav: ఇవాళ కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్ భేటీపై ఉత్కంఠ

Akhilesh Yadav: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అఖిలేష్ యాదవ్, ఆపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తరువాత, కేటీఆర్ సహా కొంతమంది నేతలతోనూ ఆయన భేటీ అవుతారు. భేటీల అనంతరం సాయంత్రం 4.30 గంటలకు అఖిలేష్ లక్నో తిరిగి బయలుదేరుతారు. అఖిలేష్‌కు స్వాగతం పలికి ప్రగతి భవన్‌కు తీసుకువచ్చే బాధ్యతను కొందరు మంత్రులకు కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story