Hyderabad: హైదరాబాద్‌లో పబ్‌లపై ఎక్సైజ్‌ పోలీసుల దాడులు

Hyderabad: పబ్‌లకు హాజరైనవారికి డ్రగ్‌ డిటెక్టివ్‌ కిట్‌లతో పరీక్షలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Aug 2024 11:24 AM IST
Excise police raids on pubs in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో పబ్‌లపై ఎక్సైజ్‌ పోలీసుల దాడులు

Hyderabad: హైదరాబాద్‌లో పబ్‌లపై ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బార్‌ అండ్‌ పబ్బులలో 25 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక సోదాలు చేశారు. పబ్‌లకు హాజరైనవారికి 12 ప్యానెల్‌ డ్రగ్‌ డిటెక్టివ్‌ కిట్‌లతో పరీక్షలు చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలహాసన్‌రెడ్డి ఆదేశాలతో జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, అసిస్టెంట్‌ కమిషనర్లు ఆర్‌. కిషన్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ పర్యవేక్షణలో 25 పబ్‌లు అండ్‌ బార్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని 12, రంగారెడ్డిలోని 13 బార్లు అండ్‌ పబ్‌లలో రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు సోదాలు జరిగాయి. పబ్‌ అండ్‌ బార్లకు హాజరైనవారందరికీ డ్రగ్స్‌ టెస్టులు నిర్వహించారు. ఇకపై ప్రతివారంలో ఏదొక రోజు ఇలాంటి ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story