గచ్చిబౌలి వద్ద ఘోర ప్రమాదం:మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మనవడి మృతి
హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య మనవాడు ద్రువత్ మరణించారు.
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మనవడు ధృవత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గచ్చిబౌలి వద్ద ధృవత్ ప్రయాణిస్తున్న బైక్ డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో అయన తలకు బలమైన గాయం తగిలింది. దాంతో అయన అక్కడికక్కడే మరణించారు. అయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పొన్నాల లక్ష్మయ్య, ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Next Story




