Harish Rao: రైతులను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బ‌డ్జెట్ ఉంది

Harish Rao: రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు

Shekhar G
Published on: 10 Feb 2024 6:25 PM IST
Ex-Minister Harish Rao Fire On Congress Govt Budget
X

Harish Rao: రైతులను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బ‌డ్జెట్ ఉంది

Harish Rao: రైతులను ఆగం చేసేలా బడ్జెట్ ఉందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. అంకెలు, ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. గ్యారంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. కేటాయింపులే సరిగా లేవు, హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని...రైతు రుణమాఫీపై ప్రకటన లేదని తెలిపారు. రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. రైతుబంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యానికి బోనస్ అనేది బోగస్‌గా మార్చారని ధ్వజమెత్తారు.

Shekhar G

Shekhar G

Next Story