Etela Rajender: టెన్త్ పేపర్ లీక్‌ కేసులో విచారణకు హాజరుకానున్న ఈటల

Etela Rajender: హన్మకొండ డీసీపీ కార్యాలయానికి ఈటల

Dhatripriya
Published on: 10 April 2023 10:43 AM IST
Etela Rajender Will Attend Hearing In Tenth Paper Leak Case
X

Etela Rajender: టెన్త్ పేపర్ లీక్‌ కేసులో విచారణకు హాజరుకానున్న ఈటల

Etela Rajender: టెన్త్ పేపర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అంశానికి సంబంధించి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణకు హాజరుకానున్నారు. హనుమకొండ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. టెన్త్ హిందీ ప్రశ్నాపత్రానికి సంబంధించిన అంశంలో ఆయనకు వరంగల్ పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈటల విచారణకు హాజరువుతున్నారు.

అయితే పరీక్ష ప్రారంభమైన గంట సేపటికి వాట్సప్‌లో హిందీ ప్రత్నాపత్రాన్ని ప్రశాంత్ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు అతడు పర్సనల్‌గా వాట్సప్‌లో ప్రశ్నాపత్రాన్ని పంపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే చాలాసార్లు ఫోన్లు కూడా చేసినట్లు తేలింది. దీంతో ఈ కేసులో ఇటీవల బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై జైలు నుంచి బయటకొచ్చారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన రోజు ఈటలకు వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story