Etela Rajender: కార్యకర్తలతో ఈటల కీలక సమావేశం

Etela Rajender:సమావేశంలో భావోద్వేగానికి గురైన కార్యకర్తలు

Samba Siva Rao
Published on: 1 May 2021 4:57 PM IST
Etela Rajender:
X

Etela Rajender

Etela Rajender: వైద్యఆరోగ్యశాఖ పదవి ముఖ్యమంత్రికి బదిలీ అయిన తర్వాత ఈటల కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈటల సున్నితంగా ఉండబట్టే ఇలాంటి పరిస్థితి తెలెత్తిందని కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. భూకబ్జా ఆరోపణలపై తాడోపేడో తేల్చుకుందాం అంటూ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మౌనం వీడాలని ఈటలను కోరిన కార్యకర్తలు.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కావాలనే ఈటలపై కుట్రలు పన్నుతున్నారని కార్యకర్తలు ఆరోపించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story