Etela Rajender: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం ?

Etela Rajender: ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్దమయ్యింది. ఈటల నిర్వహిస్తోన్న వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 1 May 2021 3:37 PM IST
All Set for Ousting of Etela Rajender!
X

Etela Rajender: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం ?

Etela Rajender: ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్దమయ్యింది. ఈటల నిర్వహిస్తోన్న వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు మొదలయినప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైద్యశాఖను తనకు బదిలీ చేయాలన్న సీఎం సిఫారసు మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

నిన్న సాయంత్రం మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలు మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించడం ఆ వెంటనే మంత్రి ఈటల కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం ఎలాంటి విచారణకైనా సిద్ధమని తాను ప్రకటన చేయడం చకచక జరిగిపోయాయి. ఈ రోజు ఉదయం విచారణ ప్రారంభమై ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుగుతుండగానే ఈటల నిర్వహిస్తున్న శాఖను తనకు బదిలీ చేయించుకున్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story