Etela Rajender: భద్రత లేకుండా మూసీ వద్దకు వెళ్దాం.. సీఎం రేవంత్‌కు సవాల్‌

Etela Rajender: రేవంత్ పాలన బాగుందని ఒక్కరన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 6:40 PM IST
Etela Rajender Is Angry With Revanth Reddy
X

Etela Rajender: భద్రత లేకుండా మూసీ వద్దకు వెళ్దాం.. సీఎం రేవంత్‌కు సవాల్‌

Etela Rajender: మూసీలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య హీట్ పుట్టిస్తోంది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. సెక్యూరిటీ లేకుండా ఇద్దరం మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దామని సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ పాలన బాగుందని అక్కడి ప్రజలు ఒక్కరన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు. హరీష్‌రావు రాసిస్తే తాను మాట్లాడతానని సీఎం అనడం అవగాహన రాహిత్యమన్నారు ఈటల.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story