Etela Rajender: నోరు., ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

Etela Rajender: పోన్ ట్యాపింగ్ చేస్తున్నారు..జాగ్రత్తగా ఉండాలి

Jyothi
Published on: 17 March 2024 2:15 PM IST
Etela Rajender Fire On Revanth Reddy
X

Etela Rajender: నోరు., ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

Etela Rajender: ప్రజా స్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన గత పాలకులకు ఏ గతి పట్టిందో.. ఇప్పటి పాలకులకు అదే గతి పడుతుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ అన్నారు. నాచారం డివిజన్ లో కాలనీ సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ ను..కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్ లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందడానికి, నిధులు పంపించేందుకు ఇక్కడి బిల్డర్లు, వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

Jyothi

Jyothi

Next Story