Etela Rajender: డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల కేటాయింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం

Etela Rajender: ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా తాత్సారం చేసింది

Jyothi
Updated on: 8 April 2024 1:16 PM IST
Etela Rajender Comments On BRS
X

Etela Rajender: డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల కేటాయింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం 

Etela Rajender: డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల కేటాయింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రం ద్వారా వచ్చిన నిధులతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా తాత్సారం చేసిందన్నారు. పేద ప్రజల కోసం కేంద్రం ద్వారా వచ్చినా నిధులను సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక చతికిలపడిందని అన్నారు.

మల్కాజ్‌గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మారేడుపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. నిరుపేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళల్లో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఈటల రాజేందర్ కు తమ గోడును వెల్లబోసుకున్నారు. తాను గెలిచిన అనంతరం సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story