Epuri Somanna: బీఆర్‌ఎస్‌లో చేరిన ఏపూరి సోమన్న... కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు

Epuri Somanna: మళ్ళీ గజ్జె కట్టి, అభివృద్ధి పాట పాడుతానన్న ఏపూరి

Jyothi
Published on: 25 Sept 2023 8:10 AM IST
Epuri Somanna joined BRS
X

Epuri Somanna: బీఆర్‌ఎస్‌లో చేరిన ఏపూరి సోమన్న... కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు

Epuri Somanna: ఏ పార్టీ అయినా..ఏ జెండా అయిన ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు ఏపూరి సోమన్న. తెలంగాణ భవన్‌లో ఏపూరి సోమన్న బీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. తనకు ఒక లక్ష్యం ఉందని, తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టక 10 ఏండ్లయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన భాగం ఉందన్నారు ఏపూరి సోమన్న. బీఆర్ఎస్‌కు కట్టుబడి పని చేస్తానన్న ఆయన...తాను తిరిగిన పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. కేసీఆర్ దారిలో నడుస్తామని, మళ్ళీ కాలుకు గజ్జె కడుతా.. కేసిఆర్ పాట పాడుతూ.. అభివృద్ధి పాట పాడుతానని ఏపూరి సోమన్న స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story