గ్రానైట్స్ కంపెనీల సోదాలపై ఈడీ ప్రెస్‌నోట్

Enforcement Directorate Press Note on Probes Granite Companies
x

గ్రానైట్స్ కంపెనీల సోదాలపై ఈడీ ప్రెస్‌నోట్

Highlights

Enforcement Directorate: గ్రానైట్స్ కంపెనీల సోదాలపై ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.

Enforcement Directorate: గ్రానైట్స్ కంపెనీల సోదాలపై ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఈనెల 9,10 తేదీల్లో కరీంనగర్‌, హైదరాబాద్‌లో సోదాలు చేశామన్న ఈడీ అధికారులు శ్వేత గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, వెంకటేశ్వర గ్రానైట్, పిఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్.. గిరిరాజ షిప్పింగ్‌కు సంబంధించిన సంస్థలపై సోదాలు చేశామని తెలిపారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై సోదాలు నిర్వహించామని ఈ సంస్థలు హాంకాంగ్, చైనా దేశాలతో పాటు ఇతర దేశాలకు గ్రానైట్ బ్లాక్ ఎగుమతి చేస్తున్నాయని గుర్తించామని తెలిపారు.

విచారణలో రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేసిన పరిమాణం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. ఎగుమతి ఆదాయం బ్యాంకు ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా స్వీకరించబడుతుందని గుర్తించినట్లు తెలిపారు. పదేళ్ల డిస్పాచ్ డేటాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్‌ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories