Telangana: జనవరి 26న హాజరు కానీ పక్షంలో సిసిఏ రూల్స్ ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు

S. Srikanth
Updated on: 22 Jan 2020 2:55 PM IST
Telangana:  జనవరి 26న హాజరు కానీ పక్షంలో సిసిఏ రూల్స్ ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు
X

వరంగల్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగు వేడుకలలో అయా శాఖల జిల్లా అధికారులతో పాటు వారి సిబ్బంది తప్పని సరిగా హాజరు కావలెనని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జె పాటిల్ అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు అధికారులు సిబ్బంది హాజరు తీసుకోవడం జరుగుతుంది.

ఆయా శాఖల జిల్లా బాధ్యులు వారి సిబ్బంది తో హజరైనట్లు సంభందిత రిజిస్టర్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ బి నెహ్రూ వద్ద ఉంటుందని ఎవ్వరైనా వేడుకలకు హాజరు కానీ పక్షంలో సిసిఏ రూల్స్ ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు గైకొనబడునని జిల్లా కలెక్టర్ హెచ్చ రిస్తు అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story