దుబ్బాకలో మొదలైన ఎన్నికల హడావిడి.. నోటిఫికేషన్ రాకముందే రాజకీయం షురూ..

దుబ్బాకలో మొదలైన ఎన్నికల హడావిడి.. నోటిఫికేషన్ రాకముందే రాజకీయం షురూ..
x
Highlights

Election fever begins in Dubbaka: దుబ్బాకలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇంకా నోటిఫికేషనే రాలేదు అప్పుడే రాజకీయ పార్టీల హడావిడి...

Election fever begins in Dubbaka: దుబ్బాకలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇంకా నోటిఫికేషనే రాలేదు అప్పుడే రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. నేతల కళ్లన్నీ ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికపైనే ఉంది. ఎన్నికల బరిలో నిలుస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే బలం నిరూపించుకుంటాం అంటోంది కమలం పార్టీ. ఇక సెంటిమెంట్‌కు తిరుగేలేదని గులాబీ పార్టీ ధీమాతో ఉంది. దుబ్బాక రాజకీయం పై హెచ్ఎంటీవీ అందిస్తోంది ప్రత్యేక కథనం.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యతో దుబ్బాక ఉప ఎన్నికపై చర్చ మరింత పదునెక్కింది. సోలిపేట రామలింగారెడ్డి భార్య ఎన్నికల బరిలో నిలిస్తే ఏకగ్రీవానికి సహకరిస్తామని ప్రకటించారు. దీంతో అలెర్ట్ అయిన పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికల బరిలో నిలుస్తున్నామని ప్రకటించారు. అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఉత్తమ్. బీజేపీ కూడా దుబ్బాక విషయంలో స్ఫష్టమైన వైఖరి తెలియజేస్తోంది. ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు దుబ్బాక బీజేపీ ఇంచార్జి ర‌ఘునంద‌న్ రావు మొగ్గు చూపుతున్నట్లు ప్ర‌చారం జరగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న దుబ్బాక నుంచి గ‌తంలో రెండుసార్లు పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేఖతను చూపించేందుకు అనువైనదిగా భావిస్తోంది. ఇప్పటికే రఘునందన్ రావు ప్రజల్లోకి వెళ్లి సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రామలింగారెడ్డి భార్య సుజాత, కొడుకు సతీశ్‌రెడ్డిలలో ఎవరికి టికెట్ ఇస్తారో తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం సతీశ్‌రెడ్డి పేరును సిఫారస్ చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం గురించి కూడా చర్చ మొదలైంది. ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో ఎవరి సత్తా ఏంటో అనేది ఎన్నిక జరిగితేనే తేలేది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ హడావిడి లేనందున దబ్బాక బై ఎలక్షన్ చర్చలో కేంద్ర బిందువు అయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories