చదువుకుంటేనే బతుకులు మారుతాయి

మనిషికి చదువే ఆస్తి, చదువుకుంటేనే బతుకులు మారుతాయి అని ప్రజాగాయకుడు ఏ ఊరి సోమన్న అన్నారు.

S. Srikanth
Published on: 17 Dec 2019 10:49 AM IST
చదువుకుంటేనే బతుకులు మారుతాయి
X

కమ్మర్ పల్లి: మనిషికి చదువే ఆస్తి, చదువుకుంటేనే బతుకులు మారుతాయి అని ప్రజాగాయకుడు ఏ ఊరి సోమన్న అన్నారు. ఆయన చేపట్టిన జ్ఞాన చైతన్య యాత్ర కమ్మర్ పెళ్లి కి చేరుకుని స్థానిక అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బతుకులు బాగు చేసుకోవాలంటే పిల్లలను గొప్ప చదువులు చదివించడమే మార్గమన్నారు. చదువు విలువను తెలియజేయడానికి జ్ఞాన చైతన్య యాత్ర చేపట్టనన్నారు. ఏవైఎస్ మండల అధ్యక్షులు సుంకరి విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు పాలేపు నర్సయ్య సభ్యులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story