ED Raids: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

ED Raids: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 11:04 AM IST
ED Raids: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
X

ED Raids: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

ED Raids: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రితో సహా ఆయన అనుచరుల ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఏక కాలంలోనే 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సీఆర్పీఎ‌ఫ్ బృందాల రక్షణ మధ్య మంత్రి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

గతేడాది నవంబర్‌ మూడో తేదీన పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story