Jagadish Reddy: మోడీ మత రాజకీయాలు ఈసీకి కనిపించడం లేదా
Jagadish Reddy: కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడం..రేవంత్, మోడీ కుట్రలో భాగమే
Jagadish Reddy: మోడీ మత రాజకీయాలు ఈసీకి కనిపించడం లేదా
Jagadish Reddy: కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రచార నిషేధం, ఓటుకి నోటు కేసుపై స్పందించారు. మోదీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోదీకి వణుకుడు మొదలైందన్నారు. ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ల కింద భూమి కంపిస్తుందని... ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపేలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుందన్నారు.
Next Story




