Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారు..

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Arun Chilukuri
Published on: 20 Aug 2022 7:19 PM IST
Eatala Rajender Slams CM KCR
X

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారు.. 

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. కేసీఆర్‌ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్‌ కోల్పోయారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వం. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్‌ మాటలకు రేపటి సభలో తప్పకుండా సమాధానం చెబుతాము. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ అని డబ్బు, మద్యాన్ని నమ్ముకున్న పార్టీ కాదని అన్నారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story