Hyderabad: ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు

Hyderabad: సమయస్పూర్తి ప్రదర్శించిన డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 4:18 PM IST
Driver had a Heart Attack While the RTC bus was Running
X

ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు

Hyderabad: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్పూర్తితో పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షేమంగా ఇంటికెళ్లారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండె పోటు వచ్చింది. ఈ సమయంలో తన కర్తవ్యాన్ని మరచిపోని డ్రైవర్ బస్సును అతికష్టం మీద పక్కకు తీశాడు. అనంతరం అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోతున్నా తమ కోసం ఆలోచించిన డ్రైవర్ కోలుకోవాలని ప్రయాణికులు ప్రార్ధిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story