ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై వేధింపుల కేసు

Arun Chilukuri
Published on: 29 Oct 2019 6:41 PM IST
ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై వేధింపుల కేసు
X

ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మహేష్‌రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని మహేష్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది ఆయన భార్య భావన. తనను పెళ్లి చేసుకొని ఇప్పుడు తెలియదంటున్నాడని వాపోయింది. చదువుకునే సమయంలో తమ మధ్య పరిచయం ఏర్పడిందని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నామని ఆమె తెలిపింది. ఏడాదిగా ఒకే దగ్గర ఉంటున్నామని ఐపీఎస్‌కు సెలక్ట్ అయినప్పటి నుండి మహేష్‌రెడ్డిలో మార్పువచ్చిందని భావన ఆరోపిస్తోంది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని చెప్పినట్లుగా ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేష్‌ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story