రాఘవాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు

రాఘవాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు
x
మంత్రి హరీష్ రావు
Highlights

రాఘవాపూర్ గ్రామంలో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాలు శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12.30 గంటలకు ఘనంగా జరిగాయి.

సిద్దిపేట: రాఘవాపూర్ గ్రామంలో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాలు శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12.30 గంటలకు ఘనంగా జరిగాయి. సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి, ఇంట్లో పుణ్యహావచనం, వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహా ప్రవేశాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, జెడ్పి ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు ముఖ్య అతిథిలుగా హాజరై గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా గృహా ప్రవేశాలు జరిపి లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు మంచిగుందా అమ్మా అంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories