హైదరాబాద్‌లోని హోటల్‌ గదిలో వైద్యుడి ఆత్మహత్య

* ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డా.చంద్రశేఖర్ * నీట్‌ ఎగ్జామ్‌ రాయించేందుకు కొడుకు, భార్యతో కలిసి హైదరాబాద్‌ రాక

Sandeep Reddy
Published on: 13 Sept 2021 11:06 AM IST
Doctor Self Destruction at Hotel Room in Hyderabad
X

హైదరాబాద్‌లోని హోటల్‌ గదిలో వైద్యుడి ఆత్మహత్య 

Hyderabad: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్‌ చంద్రశేఖర్‌ మెదక్‌ జిల్లా కేంద్రంలో అనురాధ నర్సింగ్‌ హోమ్‌ను నిర్వహిస్తున్నారు. ఆగష్టులో మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో రియల్టర్‌ ధర్మకారి శ్రీనివాస్‌ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు భావించిన పోలీసులు విచారించి వదిలేసారు.

ఇదిలా ఉండగా అబ్బాయిని నీట్‌ ఎగ్జామ్‌ రాయించేందుకు చంద్రశేఖర్ ఆదివారం భార్యతో కలిసి హైదరాబాద్‌ కుకట్‌పల్లిలోని సితార గ్రాండ్‌ హోటల్‌లో బస చేసారు. అబ్బాయికి పరీక్ష కేంద్రం వద్ద విడిచిపెట్టిన తర్వాత భార్య తిరిగి మెదక్‌ వెళ్లిపోగా హోటల్‌లో డాక్టర్‌ చంద్రశేఖర్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందారు.

కీలకమైన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story