DK Aruna: అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్‌లా అవుతావు

DK Aruna: కొడంగల్‌లో సీఎం చేసిన వ్యాఖ్యలపై అరుణ ఫైర్

Jyothi
Published on: 11 April 2024 10:33 AM IST
DK Aruna Fire On Revanth Reddy
X

DK Aruna: అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్‌లా అవుతావు

DK Aruna: అధికారం ఉందన్న అహంతో సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడని... అధికారం ఎవరికి శాశ్వతం కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని ఆమె జోస్యం చెప్పారు. నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదని, తాను గానీ, భరత సింహారెడ్డి గానీ... కాంట్రాక్టర్లకు భయపడలేదని, కాంట్రాక్టుల కోసం... పదవుల కోసం బీజేపీలో చేరలేదన్నారామె..

రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పనిచేశారా...? లేకుంటే విపక్షాలు గెలవడానికి పనిచేశారా...? అంటూ ప్రశ్నించారామె... కాంగ్రెస్ పార్టీ మొదట నాకు టికెట్ ఇవ్వలేదని, తర్వాత నా నాయకత్వం చూసి పార్టీలోకి ఆహ్వానించిందన్నారు డీకే అరుణ.. మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటరును టికెట్ అడిగే బాధ్యత తనకు ఉందని, ఏ పార్టీ వారినయినా...ఓటు అడుగుతానని... వాళ్లు ఓటు వేస్తారా... వేయరా...? అనేది ఓటరు హక్కు అన్నారామె... లోకసభ అభ్యర్థిగా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానని... సొంత జిల్లాకు చెందిన తను ఎందుకు తిరగకూడదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి సింపతి గెయిన్ కోసం తన మీద కుట్ర చేస్తున్నారని అంటున్నారని.. కుట్ర ఎలా ఉంటదో చెప్పాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అడిగారు. ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చేందుకు పనిచేయాలని సూచించారు అరుణ... అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావని, జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ఏం చేశావో... నేను ఏం చేశానో చెబుతానన్నారు... మీ పార్టీ గెలుపు కోసం మీరు పని చేయండి... మా పార్టీ గెలుపు కోసం మేం పని చేస్తామని హితవు పలికారు. కేసీఆర్ వాడిన భాషను ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను రేవంత్ గుర్తు చేసుకోవాలని సూచించారామె.

Jyothi

Jyothi

Next Story