వేంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరి విత్తనాల పంపిణీ

వేంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరి విత్తనాల పంపిణీ
x
చైర్మన్ సంతోష్ రెడ్డి,ఏవో రాజు, సొసైటీ సెక్రెటరీ వంశీ, రైతులు
Highlights

వేంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరి విత్తనాలు పంపిణీ చేశారు.చైర్మన్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కునారం118 విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ముప్కాల్: వేంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరి విత్తనాలు పంపిణీ చేశారు. చైర్మన్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సీడ్స్ వారి నాణ్యమైన 10 - 10, కునారం118 విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

కునారం సన్నాల 30కిలోల బస్తా రూ. 600లు, 10 - 10 రకం బస్తా రూ.750లు అని తెలిపారు. సొసైటీ పరిధిలోని వేంపల్లి, కొత్తపల్లి, ముప్కాల్ గ్రామాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజు, సొసైటీ సెక్రెటరీ వంశీ, రైతులు పాల్గొన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories